దేశంలోని ఆటో రంగం లో అమ్మకాల తగ్గుదలకు ఓలా మరియు ఉబెర్ లే కారణమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె మంగళవారంనాడు దేశ ఆర్ధిక స్థితి పై స్పందించారు. దేశంలో ఆర్థిక మందగమనం విస్తరిస్తోందన్న ఆందోళనలు, విమర్శల నేపథ్యంలో ముఖ్యంగా ఆటోల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంపై ఆమె మాట్లాడారు ఆర్థిక మందగమనానికి ప్రజల ఆలోచనా ధోరణిలో చేటుచేసుకుంటున్న మార్పులు ఒక కారణమని చెప్పారు. వివిధ రకాల ప్రయాణ మాధ్యమాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారనీ, ఓలా, ఉబర్ వంటి క్యాబ్‌లను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఆటో అమ్మకాలు తగ్గుముఖం పట్టడానికి త్వరలో రాబోతున్న భారత్ స్టేజ్-6 (బీఎస్6) ఎమిషన్ నిబంధనలు, హెచ్చు రిజిస్టేషన్ ఫీజులు వంటి కారణాలు కూడా ఉన్నాయన్నారు.
'ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టార్‌పై కొనుగోళ్ల తగ్గుముఖానికి.బీఎస్6 రిజిస్టేషన్ ఫీజు అంశం జూన్ వరకూ వాయిదా పడడంతో పాటు యువతరం ఆలోచనా ధోరణిలో మార్పు కూడా ఒక కారణం అని అన్నారు. ఆటోమొబైల్స్ కొనుగోలుకు 'ఈఎంఐ'లకు కమిట్ కాకుండా దీనికి ప్రత్యామ్నాయంగా ఓలా, ఉబర్, మెట్రోలో ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు' అని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనికి పరిష్కారం ఏమిటని మంత్రిని అడిగినప్పుడు, కేవలం ఢిల్లీలోనే కాకుండా, దేశవ్యాప్త సమాచారాన్ని తీసుకుంటూ, వివిధ రంగాల వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని ఆమె సమాధానమిచ్చారు.