ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

  తెలంగాణ కొత్త గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందర్ రాజన్ ,                             హిమాచల్ ప్రదేశ్‌  గవర్నర్ గా దత్తాత్రేయ



సెప్టెంబర్ 1, ఆదివారం : అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్  ఆదివారం నాడు ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు  . తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చే సింది.  తమిళనాడు బిజెపి  అధ్యక్షురాలు డాక్టర్ తమిళైసాయి సౌందర్ రాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించింది.వృత్తిరీత్యా వైద్యురాలైన 58 ఏళ్ల  తమిళైసాయి సౌంద్రాజన్‌   1999 లో రాజకీయ అరంగేట్రం చేసారు . దక్షిణ చెన్నై జిల్లా మెడికల్ వింగ్ కార్యదర్శిగా వివిధ సామర్థ్యాలలో తమిళనాడు బిజెపి విభాగంలో పనిచేశారు.  ఆగస్టు 2014 లో  పోన్ రాధాకృష్ణన్ రాజీనామా తరువాత తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా  నియమితులయ్యారు. ,ఈమె తమిళ నాడు కాంగ్రెస్ నాయకుడు కుమారి అనంతన్ కుమార్తె.   మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్‌  రాష్ట్ర గవర్నర్ గా  నియమించారు.   హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కలరాజ్ మిశ్రాను  రాజస్థాన్ గవర్నర్ గా బదిలీ చేశారు. ఇటీవల పదవీకాలం ముగిసిన సి హెచ్ విద్యాసాగర్ రావు స్థానం లో  ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోష్యారి మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. బిజెపికి కీలకమైన రాష్ట్రమైన మహారాష్ట్ర ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి . కేంద్ర పౌర విమానయాన మాజీ మంత్రి  ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కేరళ  గవర్నర్‌ గా నియమితులయ్యారు.  కేరళ గవర్నర్‌,భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి పి సతశివం ఐదేళ్ల పదవీకాలం  ఇటీవల ముగిసింది .


కొత్త గవర్నర్ నియామకాలు వారు తమ కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించిన తేదీల నుంచి అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన ఒక ప్రకటన తెలిపింది.


హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన తర్వాత బందారు దత్తాత్రేయ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. 'హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వారు ఈ బాధ్యతను నాకు ఇచ్చారు మరియు  రాజ్యాంగం ప్రకారం నేను పని చేస్తాను' అని దత్తాత్రేయ అన్నారు .