కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మోటారువాహన సవరణ చట్టం తెలుగు రాష్ట్రాల్లలో ఇప్పుడే అమలు కాకపోవచ్చని తెలుస్తోంది.మోటారు వాహనాల సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమగ్రంగా సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తగిన నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో కొత్త చట్టం అమలు నిర్ణయంపై మరికొంత సమయం పడుతుందని సమాచారం . కొత్త చట్టం పై ప్రజలకు సరైన అవగాహన కల్పించిన తర్వాతనే దీన్ని అమలు చేస్తామని తెలంగాణ రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ చెప్పారు
వాహన దారులకు ఊరట