తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యదర్శి దీని గురించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత డిసెంబర్ లో రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం వుంది . ఇందులో భాగంగా ఈ నెల 9న తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు.ఈ సారి బడ్జెట్ సమావేశాలు వాడి ,వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆరఎస్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి .
9 నుంచి అసెంబ్లీ సమావేశాలు